English | Telugu
రష్మికలోని బీస్ట్ ని చూశారా .. వైరల్ అవుతున్న కొత్త వీడియో..!
Updated : Sep 14, 2023
చిత్ర పరిశ్రమలో హీరోలకైనా, హీరోయిన్లకైనా, విలన్లకైనా.. శరీరాకృతినే అవకాశాలకు పెట్టుబడి. అందుకే.. తీరైన ఆకృతి కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. జిమ్ లో చెమటోడ్చుతూ కనిపిస్తుంటారు. ఇక నేషనల్ క్రష్ గా జనాల నీరాజనాలు అందుకున్న రష్మికా మందన్న కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియోనే ఇందుకు నిదర్శనం.
ఇంతకీ వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏముందంటే.. తన ట్రైనర్ జునైద్ షేక్ సూచనలకు అనుగుణంగా రష్మిక చేస్తున్న వర్కౌట్స్. ఇందులో రష్మిక శ్రమిస్తున్న తీరు చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ వర్కవుట్ చేసే సమయంలో తన దేహం నుంచి ప్రాణం వీడిపోతున్నట్లుగా, మళ్ళీ ప్రాణం తిరిగివచ్చినట్లుగా ఉందని.. తనని ఓ క్రమ పద్ధతిలో సూపర్ హ్యుమన్ గా జునైద్ మలుచుతున్నాడని కామెంట్ చేసింది రష్మిక. అంతేకాదు .. తనలో ఉన్న అంతర్గత మృగాన్ని ఈ వీడియో బయటకు తీస్తోందని అభిప్రాయపడింది. అలాగే.. ఈ వర్కవుట్ తో తాను చాలా చాలా సంతోషంగా ఉన్నట్లుగా ముక్తాయించింది రష్మిక.
ప్రస్తుతం రష్మిక చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తన చేతిలో పుష్ప ది రూల్, యానిమల్, ధనుష్ 51, రెయిన్ బో చిత్రాలున్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో పలకరించబోతున్నాయి.