English | Telugu
పాటల సందడికి 'హాయ్' చెబుతున్న నా(ని)న్న
Updated : Sep 14, 2023
ఈ ఏడాది ఆరంభంలో 'దసరా'తో మంచి విజయాన్ని అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. 'హాయ్ నాన్న' సినిమాతో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నానికి జంటగా మృణాళ్ ఠాకూర్ నటిస్తుండగా.. శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనుంది. 'ఖుషి' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహబ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నాడు. డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే, 'హాయ్ నాన్న' పాటల సందడికి శ్రీకారం చుట్టింది యూనిట్. ఇందులో భాగంగా "సమయమా" అంటూ మొదలయ్యే పాట తాలూకూ లిరికల్ వీడియోని సెప్టెంబర్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు నాని అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న సినిమా కావడంతో.. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ వెర్షన్స్ లోనూ ఈ సాంగ్ అదే రోజు ఎంటర్టైన్ చేయనుంది. మరి.. హేషమ్ బాణీలు 'హాయ్ నాన్న'కి ఏ స్థాయిలో ప్లస్ అవుతాయో చూడాలి.