English | Telugu
'స్కంద' కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసా?
Updated : Oct 9, 2023
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన మాస్ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా 11వ రోజైన రెండో ఆదివారం నాడు(అక్టోబర్ 8న) క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉన్నప్పటికీ కోటికి పైగా షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. 11వ రోజైన నిన్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1.10 కోట్ల షేర్ తో సత్తా చాటింది.
11 రోజుల్లో నైజాంలో రూ.10.63 కోట్ల షేర్, సీడెడ్ లో రూ. 4.08 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.12.36 కోట్ల షేర్ రాబట్టిన స్కంద.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.27.07 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2.67 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.1.91 కోట్ల షేర్ కలిపి.. 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.31.65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.47 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన స్కంద మూవీ.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితిలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యం. నిజానికి ఈ సినిమాకి వచ్చిన టాక్ కి ఫుల్ రన్ లో రూ.30 కోట్ల షేర్ రాబట్టడం కూడా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ సినిమా ఇప్పటికే దాదాపు 32 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ప్రస్తుతం థియేటర్లలో భారీ సినిమాలు లేకపోవడంతో రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టినా ఆశ్చర్యంలేదు. అంటే ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.12-13 కోట్ల దాకా నష్టాలను చూసే అవకాశముంది.
స్కంద 11 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.10.63 కోట్ల షేర్
సీడెడ్: రూ. 4.08 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.12.36 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు: రూ.27.07 కోట్ల షేర్
రెస్టాఫ్ ఇండియా: రూ.2.67 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.1.91 కోట్ల షేర్
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ.31.65 కోట్ల షేర్