English | Telugu

తెలంగాణ ఎన్నికలు.. నందమూరి కళ్యాణ్ రామ్ పరిస్థితి ఏంటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లో ఉంటాయని, దాంతో డిసెంబర్ లో విడుదల కావాల్సిన సినిమాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భావించారంతా. కానీ నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు ఉంటాయని అధికారిక ప్రకటన రావడంతో డిసెంబర్ లో విడుదల కావాల్సిన సినిమాలు దాదాపు సేఫ్ అయ్యాయి. అయితే నవంబర్ 24న విడుదల కానున్న నందమూరి కళ్యాణ్ రామ్ మూవీ 'డెవిల్'పై మాత్రం ఎన్నికల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఇందులో ఆయన బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌ గా కనిపించనున్నారు. అభిషేక్ నామా దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నారు. అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు రోజుల ముందు ఈ సినిమా విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికలంటే హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎన్నికలకు వారం, రెండు వారాల ముందు.. అసలు సినిమాల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు. స్టార్ హీరోలు సైతం ఎన్నికల హడావుడి టైంలో సినిమా విడుదల చేయాలంటే వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఎన్నికలకు ఆరు రోజుల ముందు కళ్యాణ్ రామ్ సినిమా విడుదలైతే జనాలు పట్టించుకుంటారా అనే అనుమానాలు ఉన్నాయి. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకుంటాడో లేక అదే తేదీకి మొండిగా వస్తాడో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.