English | Telugu
చిక్కుల్లో నయనతార భర్త విగ్నేష్
Updated : Oct 9, 2023
తెలుగు సినిమా ప్రేక్షకులని దర్శకుడు విగ్నేష్ శివన్ గురించి మీకు తెలుసా అని అడిగితే ఆయన ఎవరు ఏ ఏ సినిమాలు తీశారు మాకు తెలియదే అని అంటారు.కానీ నయన తార భర్త విగ్నేష్ శివన్ తెలుసా అని అడిగితే అతనా తెలుసు అని అంటారు. నయన తార భర్త ఇప్పుడు విగ్నేష్ సరికొత్త వివాదం లో చిక్కుకున్నాడు. తమిళ సినిమా ఇండస్ట్రీ ని శాసించే దళపతి విజయ్ స్టయిలిస్ట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ లని ట్రోల్ చేసిన వాళ్ళని విగ్నేష్ సమర్దించాడని విజయ్ అండ్ లోకేష్ ఫాన్స్ లు విగ్నేష్ మీద మండిపడుతున్నారు.
విగ్నేష్ శివన్ తమిళ నాట మంచి పేరున్న దర్శకుడు. టాప్ హీరోయిన్ నయన తార ని వివాహమాడి సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి కూడా విగ్నేష్ తండ్రి అయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే కొన్ని రోజుల క్రితం లియో డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ తన సోషల్ మీడియా బయో లో నుంచి లియో సినిమాని తీసేసాడు. దాంతో లోకేష్ అలా చేసాడు ఏంటి అని విజయ్ ఫాన్స్ లోకేష్ ని వివరణ కోరితే ఒక ఇంటర్వ్యూ లో తాను ఎందుకు అలా చెయ్యాల్సివచ్చిందో వివరణ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత కొంత మంది విజయ్ అండ్ లోకేష్ మధ్య తేడాలు వచ్చాయని అంటూ లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ మీద ట్రోల్ల్స్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు .
వీటికి విగ్నేష్ కి సంబంధం ఏంటి.. విగ్నేష్ ని విజయ్ లోకేష్ ఫాన్స్ ట్రోల్ చెయ్యడం ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడే విగ్నేష్ ఒక పొరపాటు చేసాడు. లోకేష్ ని విజయ్ ని ట్రోల్ చేస్తున్న వారి ట్వీట్ కి విగ్నేష్ లైక్ కొట్టాడు. లోకేష్ ఫోటో ఉంది కదా అని లోపల ఏ మేటర్ రాసి ఉందొ అని చూడకుండా విగ్నేష్ లైక్ కొట్టే సరికి విజయ్ ఫాన్స్ కి లోకేష్ ఫాన్స్ ఇద్దరికి విగ్నేష్ మీద కోపం వచ్చింది. దీంతో పరిస్థితిని గ్రహించిన విగ్నేష్ నేను విజయ్ సర్ కి లోకేష్ లకి అభిమానిని అని చెప్పుకురావడమే కాకుండా లోపల ఉన్న మ్యాటర్ చదవకుండా లోకేష్ బొమ్మ ఉంది కదా అని లైక్ చేసానని చెప్పుకొచ్చాడు.