English | Telugu
అడిగినంత ఇస్తే ఓకే... మహేష్ హీరోయిన్
Updated : Oct 9, 2023
ఆమె ఎంత అందంగా ఉంటుందంటే పాల కడలి ని చిలికినప్పుడు అమృతం తో పాటు తను కూడా పుట్టిందా అనేంత అందంగా ఉంటుంది., తనెవరో కాదు ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి..ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులకి ఆమె పేరు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు మీనాక్షి మాకెందుకు తెలియదు అని మీనాక్షి నటించిన సినిమా పేర్లు చెప్తారు. తాజాగా ఈ అమ్మడు కి చెందిన ఒక వార్తని విని అందరు కరెంటు షాక్ కొట్టిన వాళ్ళలా నిలబడిపోతున్నారు. కొంత మంది అయితే మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతని మీనాక్షి పర్ఫెక్ట్ గా అమలు చేస్తుందని అంటున్నారు.
మీనాక్షి ప్రస్తుతం మహేష్ బాబు తో గుంటూరు కారం అనే సినిమా లో ఒక హీరోయిన్ గా చేస్తుంది.మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని మీనాక్షి తన సొంత టాలెంట్ తో నే సంపాదించింది.రవి తేజ సరసన నటించిన ఖిలాడీ,అడవి శేషుతో చేసిన హిట్ 2 మూవీల్లో కథ కి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించి మంచి మార్కులని సంపాదించింది.ఆ రెండు సినిమాలే మహేష్ తో గుంటూరు కారం సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టాయి.
ఇంక అసలు విషయానికి వస్తే .మీనాక్షి ప్రస్తుతం తన రెమ్యునరేషన్ ని కోటిన్నర రూపాయిలు చేసిందంట.మీనాక్షి లాంటి ఫిగర్ నోటి వెంట అంత పెద్ద ఫిగర్ వినే సరికి కొంత మంది షాక్ అవుతున్నారు. కొంత మంది ఇందాక మనం పైన చెప్పుకున్న సామెత ప్రకారం అని అంటుంటే ఇంకొంత మంది మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన నటించే హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలి అని అంటున్నారు.