English | Telugu
'మ్యాడ్' కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే నిజంగానే మ్యాడ్ అయిపోతారు!
Updated : Oct 9, 2023
కొన్నిసార్లు కొత్త వాళ్ళు చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మ్యాడ్' మూవీ అలాంటి మ్యాజిక్ నే చేస్తోంది. కొత్త హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ(చినబాబు) కుమార్తె హారిక నిర్మాతగా పరిచయం కావడం విశేషం. ఇలా ఎందరో కొత్తవారు కలిసి పనిచేసిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కామెడీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. యూత్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతుండటంతో రోజురోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ దూసుకుపోతోంది.
ప్రొడ్యూసర్స్ తెలిపిన దాని ప్రకారం.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.1.8 కోట్ల గ్రాస్ రాబట్టిన మ్యాడ్ మూవీ.. రెండో రోజు ఏకంగా రూ.2.9 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక మూడో రోజైతే ఆ జంప్ ఇంకా ఎక్కువగా కనిపించింది. మూడో రోజు ఏకంగా రూ.3.7 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో మూడో రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.8.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దసరా దాకా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఫుల్ రన్ లో రూ.15 కోట్ల దాకా గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.