English | Telugu

ఇక టీవీ లో పవన్ బ్రో  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. తమిళ మాతృక వినోదయ సిత్తం కు రీమేక్ గా సముద్రఖని దర్శకత్వం లో జులై 28 న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ అయిన బ్రో మూవీ ఎందుకో తెలియదు గాని ఆశించనంత విజయాన్ని అయితే అందుకోలేక పోయింది. మూవీ బాగుందనే టాక్ వచ్చినా కూడా రన్నింగ్ లో ఆడాల్సినంత గొప్పగా బ్రో మూవీ ఆడలేదు. ఇప్పుడు పవన్ అభిమానులు సినీ అభిమానులు ఆనందపడేలా ఈ మూవీ కి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది.

కాలాన్ని నడిపే ఒక శక్తిగా పవన్ ప్రధాన పాత్రలో నటించిన బ్రో మూవీలో పవన్ ని చూసి అభిమానులు,ప్రేక్షకులు ఎంతగానో ఆనందపడ్డారు. ఈ సినిమాలో పవన్ యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది. బాధల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ని టీజ్ చేస్తూ పవన్ చేసే అల్లరి అందరికి నవ్వుల్నీ తెప్పిస్తుంది. అలాగే తేజ్ తో నువ్వు ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం తో పాటు నువ్వు ఎంతగానో ప్రేమించే నీ కుటుంబం కూడా నిన్ను పారేసే దాకే ఆలోచిస్తుంది ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఎప్పటిలాగానే బతుకుతుంటారు అనే గొప్ప ఫిలాసఫీ ని కూడా పవన్ చెప్తాడు. అంతే కాకుండా చనిపోయిన తేజ్ కి పవన్ బతకడానికి కొంత టైం కూడా ఇస్తాడు. పవన్, తేజ్ కి ఇచ్చిన ఈ టైమే బ్రో మూవీ కథ మొత్తాన్ని నడిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూర్చిన స్క్రీన్ ప్లే మాటలు ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తూ బ్రో మూవీ ని చూడవచ్చు .జీవిత సత్యాన్ని చెప్పే ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ ,ప్రియా వారియర్ ,తనికెళ్ళ భరణి ,బ్రహ్మానందం,రోహిణి ,వెన్నెల కిశోర్ తదితర నటులు నటించారు. థమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు?సాయి ధరమ్ తేజ్ ఎవరు ? చనిపోయిన తేజ్ కి పవన్ ఎందుకు 90 రోజులు టైం ఇచ్చాడు అనే విషయాలన్నింటిని తెలుసుకోవాలంటే ఈ నెల 15 న జీ ఛానెల్ లో ప్రసారం కాబోయే బ్రో మూవీ చూసి తెలుసుకోండి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .