English | Telugu

ఐ లవ్ యు నాన్న... థమన్ ఎమోషనల్ పోస్ట్!

సిల్వర్ స్క్రీన్ మీద హీరో పేరు పడితే హీరో అభిమానులు ఎంతగా ఈలలు వేస్తారో అలాగే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మ్యూజిక్ ఎస్ ఎస్ థమన్ అని పడగానే అంతే ఈలలు. అంతలా థమన్ స్టార్ స్టేటస్ ని సంపాదించాడు. కాకపోతే థమన్ కి ఆ స్టేటస్ ఓవర్ నైట్ తో వచ్చింది కాదు. ఎన్నో సంవత్సరాల కృషి థమన్ ని ఆ రేంజ్ లో ఉంచింది. కీ బోర్డు ప్లేయర్ గా ఎన్నో గొప్ప గొప్ప సినిమాల సంగీత శాఖలో పని చేసి నేడు భారతీయ చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన థమన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక పిక్ అండ్ ఒక భావోద్వేగమైన పోస్ట్ అందరి హృదయాల్ని కలిచివేసింది.

కిక్ మూవీ తో థమన్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పరిచయమైన మొదటి సినిమాకే తెలుగు సంగీత ప్రియులు అంతవరకు వినని సరికొత్త బాణీలని కిక్ కి అందించి తెలుగు సినిమా సంగీతానికి మంచి కిక్ ని ఇచ్చాడు.ఇక అక్కడనుంచి వెనుతిరగకుండా ఎన్నో సినిమాలకి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చి ప్రేక్షకులు నిత్యం తమ నోటి వెంట హమ్ చేసుకొనే పాటలనిఆయన అందించారు. ఆ తరవాత ఆయన నుంచి వచ్చిన చాలా సినిమా సంగీతేహం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు. తిరిగి అల వైకుంఠపురం సినిమాతో మళ్ళి తన మ్యూజిక్ మేజిక్ ప్రారంభం అయ్యింది . ఇప్పుడు ఏ హీరో సినిమా చూసిన థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటున్నాడు. అలాగే సినిమా ఘన విజయానికి థమన్ కంపోజ్ చేసిన పాటల తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా విజయానికి కారణం అవుతుంది. ఇటీవలే వచ్చిన అఖండ మూవీ విజయమే ఒక ఉదాహరణ.

ఇంక అసలు విషయానికి వస్తే. తమన్ తాజాగా తన ట్విట్టర్ లో ఏ .ఐ టెక్నాలజీ తో తన తండ్రి పిక్ ని పెట్టాడు. ఆ పిక్ కి క్యాప్షన్ గా నాన్న మీరు మా నుంచి దూరం అయ్యి 28 సంవత్సరాలు అవుతుంది. కానీ మీరు మా నుంచి దూరం కాలేదు మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు మీ వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాము ఐ లవ్ యు నాన్న అని థమన్ ఎంతో భావోద్వేగం తో పోస్ట్ పెట్టాడు.తన తండ్రి ని తలుచుకుంటూ పెట్టిన ఈ పోస్ట్ చూసిన థమన్ ఫాన్స్ అండ్ నెటిజన్స్ థమన్ కి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో అని అనుకుంటున్నారు. థమన్ కి చాలా చిన్న వయసు ఉన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయాడు .అప్పటి నుంచి కుటుంబ పోషణ కోసం థమన్ సంగీతానికి సంబంధించిన దాంట్లోనే పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ స్వయం కృషితో ఈ స్టేజ్ కి వచ్చాడు. థమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమర్. అయన సుమారు 700 సినిమాలకి డ్రమ్మర్ గా పనిచేసారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర శివకుమార్ గారు ఎక్కువ సినిమాలకి పని చేసారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.