English | Telugu
బాలయ్యకి మోక్షజ్ఞ మాస్ వార్నింగ్.. అంత మాట అనేశాడేంటి!
Updated : Oct 9, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణకి ప్రేమ, కోపం అన్నీ ఎక్కువే. ఏదీ మనసులో దాచుకోరు. తన మనసుకి ఏది అనిపిస్తే అది చెప్తారు. తాజాగా బాలకృష్ణ, తన కుమారుడు మోక్షజ్ఞకి తనపై కోపం వచ్చిందని పబ్లిక్ గా వేదికపై చెప్పి.. అందరినీ ఆశ్చర్యపరిచారు.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న వరంగల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హీరోయిన్ శ్రీలీల విషయంలో తనపై మోక్షజ్ఞకి కోపం వచ్చిందని ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.
"ఈరోజు ఉదయమే శ్రీలీలతో ఒక మాట అన్నాను. ఈ సినిమాలో నన్ను చిచ్చా చిచ్చా అని పిలిచి టార్చర్ పెట్టావు. నెక్స్ట్ మూవీలో మనిద్దరం హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేద్దాం అన్నాను. ఈ మాట ఇంటికి వెళ్ళి మా వాళ్ళతో చెప్పాను. అది విని మా అబ్బాయి మోక్షుకి కోపం వచ్చింది. నేను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాను, నువ్వేమో ఆమెకి హీరోయిన్ గా ఆఫర్ ఇస్తావా.. ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అన్నాడు. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే, శ్రీలీల తెలుగులో గర్వించదగ్గ నటి అవుతుంది" అన్నారు బాలకృష్ణ.
కాగా బాలయ్య ఎలాంటి దాపరిపం లేకుండా తన కుమారుడితో జరిగిన సరదా సంభాషణను పబ్లిక్ వేదికపై పంచుకోవడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.