English | Telugu
హీరోల పై సెటైర్ వేసిన చిరంజీవి
Updated : Oct 14, 2023
మెగా స్టార్ చిరంజీవి నటుడుగా ఎంత స్థాయిని సంపాదించున్నాడో వ్యక్తిగత విషయంలోనూ అలాగే క్రమశిక్షణని పాటించడంలోను అంతే స్థాయిని సంపాదించుకున్నాడు. ఏ రోజు ఎవరి గురించి చెడు గా మాట్లాడటం గాని ,ఎవర్ని విమర్శించడం గాని ఆయన చెయ్యలేదు. తన పని తాను చేసుకుంటూ పోతారు. కాని ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్ లో ఆయన ఎప్పుడు లేని విధంగా ఒక విషయం గురించి మాట్లాడటం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు దక్షిణ భారత దేశ సినీ పరిశ్రమలో కూడా సంచలనం సృష్టిస్తుంది.
చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో చిరంజీవి తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి తన అభిమానులకి ప్రేక్షకులకి తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒక సినిమా ప్లాప్ అయిన ఆ నెక్స్ట్ సినిమాతో చిరంజీవి సంచలనం సృష్టిస్తాడని సినిమా ప్రేక్షకుల అందరికి తెలుసు అందరికి తెలుసు. అలాగే ఆ ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది.ఆ విషయాలన్నీ అలా ఉంచితే చిరంజీవి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి చేసాడో అని అందరు అంటున్నారు.
ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే నా హీరోయిజాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , రీ రికార్డింగ్ వంటివి ఎలివేట్ చేయడం కాదని నా నుంచి డాన్స్, నటన, ఫైట్ లు ని నా అభిమానుల తో పాటు ప్రేక్షకులు కోరుకుంటారని చెప్పాడు. మెగాస్టార్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్య ఇప్పుడు వైరల్ గా మారింది. వాస్తవానికి గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెర మీద హీరోయిజం కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే ఎలివేట్ అవుతు వస్తుంది. దీంతో ఇప్పుడు చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి.