English | Telugu

హీరో మరణాన్ని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె ! 

ఆ నటుడు ఆషామషి దర్శకుడి సినిమా ద్వారా వెండి తెర కి పరిచయం కాలేదు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుడి దర్సకత్వంలో హీరోగా ఆ నటుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి ఇటివలే మరణించాడు. ఇప్పుడు ఆ నటుడి తల్లికి చెందిన ఒక వార్త బయటకి రావటం తో అందరు షాక్ కి గురయ్యారు.
బాబు...ఎన్ ఉయుర్ తోలన్ అనే సినిమా ద్వారా భారతి రాజా దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యి సుమారు 10 సినిమాల వరకు నటించి మంచి హీరోగా పేరు సంపాదించాడు.తమిళ సినిమా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగే క్రమంలో దురదృష్టవశాత్తు ఒక సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యి 30 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన తల్లి ప్రేమ బాబు కి అన్ని తానై చేసింది. తన బిడ్డ చనిపోకుండా తన కోసమే కోమాలో ఉన్నాడని భావించి బాబుకి అన్ని సపర్యలు చేసింది. అలా ఒకటి కాదు రెండు కాదు 30 ఏళ్ళు చేసిందంటే ఆవిడకి తన బిడ్డ అంటే ఎంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. తన బిడ్డ చనిపోకుండా తన కళ్ళెదుటే ఉన్నా చాలనుకొని ఎంతో మంది దేవుళ్ళకి మొక్కుకుంది. కాని ఆ దేవుడు బాబు తల్లి ప్రేమని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదేమో బాబు ని ఇటివలే తన దగ్గరికి తీసుకోని వెళ్ళాడు.కొన్ని రోజుల క్రితమే కోమాలో ఉన్న బాబు అనంత లోకాల్లో కలిసి పోయాడు.

దాంతో ఆ తల్లి గుండె ఎంతగానో విలవిలలాడి పోయింది. తన బిడ్డ తన కళ్ళ ముందు లేడని కడుపుకి తినలేదమో,కళ్ళు మూసుకుంటే తన బిడ్డే గుర్తుకొస్తున్నాడేమో అని నిధ్రపోలేదేమో, తన బిడ్డ లేని లోకం లో నేను బతికి ఉండటం ఎందుకు అని అనుకొని తన బిడ్డ దగ్గరకే తనని తీసుకు వెళ్ళమని దేవుడిని రోజు వేడుకుందేమో గాని బాబు తల్లి ప్రేమ ఇటివలే ఆరోగ్యం క్షీణించి తనువు చాలించింది.దీంతో తమిళ పరిశ్రమ విషాద వదనంలో మునిగిపోయింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.