English | Telugu
ఒక్క పోస్ట్‌తో నెగెటివ్ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టింది!
Updated : Oct 14, 2023
తమిళ టి.వి. నిర్మాత రవీందర్, మహాలక్ష్మీ ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, వీరి వివాహం దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసిన విసయం తెలిసిందే. వీరు పెళ్ళి చేసుకొని నెటిజన్ల ట్రోలింగ్‌కి గురయ్యారు. ఆ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని వారు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా తనను మోసం చేశాడంటూ ఓ వ్యక్తి రవీందర్‌పై చీటింగ్ కేసు పెట్టాడు. ప్రస్తుతం రవీందర్ జైలులో ఉన్నాడు. ఈ సమయంలో రవీందర్‌పై మహాలక్ష్మీ కొన్ని ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తనను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడని, ఈ చీటింగ్ కేసు గురించి తనతో చెప్పలేదని... ఇలా రకరకాల విమర్శలు చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొందరు మహాలక్ష్మీపై సింపతీ చూపిస్తే, మరికొందరు భర్త జైలులో ఉంటే భార్య ఇలా మాట్లాడడం తగదు అంటూ విమర్శించారు. ఇవి కాక ఇంకా రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వీటన్నింటికీ మహాలక్ష్మీ ఒక్క పోస్ట్‌తో ఫుల్‌స్టాప్ పెట్టింది. దాని సారాంశం ఇది.. ‘నా పెదవులపై చిరునవ్వు తెప్పించే విషయంలో నువ్వు ఎప్పుడూ విఫలం కాలేదు. ప్రేమకు నమ్మకమే ప్రధానం. నాకంటే నమ్మకమే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తోంది. ఎప్పటిలాగే ప్రేమను చూపించు. ముందుకంటే ఎక్కువగా ప్రొటెక్ట్ చేయ్’. ఈ పోస్టు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చేందుకే పెట్టిందని అర్థమవుతోంది. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.