English | Telugu
బోయపాటి శ్రీను నెక్స్ట్ మూవీ హీరో ఎవరు?
Updated : Oct 13, 2023
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఎంతో మంది మాస్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. బోయపాటి తన సినిమాలో హీరోని ఊర మాస్ రేంజ్ లో చూపిస్తాడు. ఎంతలా అంటే ఆ హీరో అంతకు ముందు తను నటించిన ఏ ఇతర సినిమాలో కూడా అంత రేంజ్ లో కనపడడు. విలన్ కి వార్నింగ్ ఇవ్వడంలో గాని ,రౌడిలని కొట్టడం లో గాని హీరో చేసే విన్యాసానికి ప్రేక్షకులు అలాగే కన్నార్పకుండా చూస్తారు. అలాగే బోయపాటి సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అయన తాజాగా స్కంద మూవీతో రామ్ పోతినేని ఇమేజ్ నే మార్చాడు. ఇటివలే రిలీజ్ అయిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇప్పుడు బోయపాటి నెక్స్ట్ సినిమా ఎవరితో అనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తుంది.
బోయపాటి...ఈ ఒక్క పేరు చాలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ల వర్షంలో తడిసి ముద్దవ్వడానికి. ఆయన తన మొదటి సినిమా తులసి దగ్గర నుంచి నేటి స్కంద వరకు దాదాపు 10 సినిమాలు ఆయన దర్సకత్వం లో వచ్చాయి. వాటిల్లోఎక్కువ శాతం విజయవంతమైన సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు బోయపాటి తన తదుపరి చిత్రం కోసం ముగ్గురు హీరోల కోసంక్ కథలని రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.అల్లు అర్జున్ అండ్ సూర్య అండ్ బాలయ్య ల కోసం బోయపాటి కథలు తయారు చేసుకున్నాడు.అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీ గా ఉన్నాడు.ఆ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ మూవీ ఉంటుందని అఫీషియల్ గా అనౌన్సుమెంట్ కూడా వచ్చింది. సూర్య కూడా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ కాకుండా వెట్రి మారన్ తో ఒక సినిమా చేస్తున్నాడు.ఆ చిత్రం త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది.
ఇక బోయపాటి బాలకృష్ణ ల అఖండ 2 సినిమా రావాలన్న చాల టైం పట్టేలా ఉంది. బాలయ్య తన నెక్స్ట్ సినిమా బాబీ దర్సకత్వం లో చేస్తున్నాడు. ఆల్రెడీ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది.భగవంత్ కేసరి మూవీ ప్రొమోషన్ అండ్ రిలీజ్ అవ్వగానే బాలయ్య ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. సో బోయపాటి నుంచి కొత్త సినిమా రావటానికి చాల లేట్ అయ్యేలా ఉంది. మరి ఈ లోపు ఒక మోస్తరు హీరో తో బోయపాటి సినిమా చేస్తాడేమో చూడాలి .స్కంద 2 ఉంటుందని స్కంద మూవీ చివర చెప్పిన అది ఇప్పుడల్లా అయ్యే పని కాదు అని అంటున్నారు.