English | Telugu

అఖిల్‌ కొత్త సినిమా: ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్‌బస్టర్‌ కోసం కసరత్తు! 

చిన్నతనంలోనే ‘సిసింద్రీ’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్న అఖిల్‌ అక్కినేని ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడంలో సక్సెస్‌ అవ్వలేకపోయాడు. ఏ జోనర్‌లో సినిమా చేసినా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేకపోయాడు, వారికి దగ్గర కాలేకపోయాడు. ఇప్పటివరకు తను చేసిన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో జోనర్‌లో చేసినా ఫలితం లేకపోయింది. చివరికి సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘ఏజెంట్‌’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అది కూడా అతన్ని నిరాశపరచింది. దాంతో ఆరు నెలలుగా ఏ సినిమా కమిట్‌ అవ్వకుండా మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాడు.

సాయిధరమ్‌తేజ్‌తో ‘విరూపాక్ష’ వంటి సూపర్‌హిట్‌ మూవీ చేసిన కార్తీక్‌ దండుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు అఖిల్‌. ఈసారి థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌తో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అఖిల్‌కి సరిపోయే కథని కార్తీక్‌ చెప్పడం, ఆ కథ అఖిల్‌కి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. ఈ దసరాకి లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ఓకే, డైరెక్టర్‌ ఓకే, హీరో ఓకే.. ఇప్పుడు హీరోయిన్‌ కోసం అన్వేషణ మొదలుపెట్టారట. టాలీవుడ్‌లోని యంగ్‌ హీరోయిన్లతో సినిమాలు చేసేసిన అఖిల్‌ ఈసారి బాలీవుడ్‌ హీరోయిన్‌ని ట్రై చేద్దామకుంటున్నాడట. మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఆ బాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఈ సినిమాకి సంబంధంచిన పూర్తి వివరాలను మేకర్స్‌ త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.