English | Telugu
తగ్గేదేలే అంటున్న యష్.. ఆ సినిమా కోసం రూ.150 కోట్లు డిమాండ్!
Updated : Oct 22, 2023
KGF 1, KGF 2 చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారారు రాకింగ్ స్టార్ యష్. ఈ రెండింటిలోనూ KGF 2 ఏకంగా 1200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో యష్ రేంజ్ ఆకాశాన్నంటింది. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఏదోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదిన్నరగా యష్ ఖాళీగా ఉంటున్నారు కానీ.. కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయనేలేదు. ఇది ఆయన అభిమానులను కలవపెడుతుంది. రీసెంట్‌గా ఓ లేడీ డైరెక్టర్‌తో కలిసి మరోసారి మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ చేయబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ దీంతో పాటు ఇప్పుడు మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
అదేంటంటే పౌరాణిక చిత్రం రామాయణం. నితీష్ తివారి తెరకెక్కించబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌భీర్ కపూర్ నటిస్తారంటూ వార్తలు వచ్చాయి. అలాగే సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనుందని సమాచారం. ఇందులో రావణాసురుడుగా యష్ నటించబోతున్నారంటూ చాలా రోజులుగా న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గానే యష్ ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్‌లోనూ పాల్గొన్నారట. అయితే రావణాసురుడిగా నటించటానికి ఆయన అభిమానులు అంగీకరించరు. కానీ యష్ మాత్రం నటించటానికి భారీ రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేశారట. అంత ఇంతా కాదు.. ఏకంగా 150 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు సమాచారం.
భారీ బడ్జెట్ చిత్రం, అందులోనూ రామాయణం కావటం, పెరిగిన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ సైతం యష్ అడిగినంత ఇవ్వటానికి రెడీ అయినట్లు న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే తమిళంలో రజినీకాంత్, దళపతి విజయ్ వంటి వారితో పాటు తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ రెమ్యూనరేషన్స్ పరంగా వంద కోట్ల మార్క్‌ను ఎప్పుడో దాటేశారు. ఇప్పుడు వారి సరసన యష్ కూడా జాయిన్ అయ్యారు.