English | Telugu
కోలీవుడ్ డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ
Updated : Oct 24, 2023
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో ఆయన మోకాలి శస్త్ర చికిత్స కూడా చేసుకున్నారు. ఇప్పుడు అంతా సెట్ అనుకున్న తర్వాత నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. నిజానికి మెగా 157గా వశిష్ట దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమాను మెగా 156గా ముందుగా షూటింగ్‌ను స్టార్ట్ చేసేస్తున్నారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో సినిమా స్టార్ట్ కానుంది. ఇప్పటికే మేకర్స్ దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మూవీ అవగానే చిరంజీవి నెక్ట్స్ మూవీని వెంటనే స్టార్ట్ చేయటానికి రెడీ అయిపోతున్నారని సినీ సర్కిల్స్ సమాచారం.
సినీ వర్గాల కథనం మేరకు తమిళ దర్శకుడు పి.ఎస్.మిత్రన్‌తో కలిసి చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారట. మెసేజ్ చిత్రాలను కమర్షియల్ ఫార్మేట్‌లో చెప్పటంలో మిత్రన్‌కు ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన అభిమన్యుడు, సర్దార్ చిత్రాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ డైరెక్టర్ అభిమన్యుడు తర్వాత విశాల్‌తో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారట. రీసెంట్‌గా చిరంజీవిని కలిసి ఆయన కథ నెరేట్ చేయగా ఆయనకు చాలా బాగా నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ చేయమని కూడా చెప్పేసినట్లు టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లు మెసేజ్, కమర్షియల్ ఎలిమెంట్స్ కాంబినేషన్‌లో ఈ సినిమాను మిత్రన్ తెరకెక్కించబోతున్నారు. చిరంజీవి కుమార్తె సుష్మితతో పాటు ఓ తమిళ నిర్మాణ సంస్థ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. మరో వైపు మెగా 157 సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుంది. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వశిష్ట ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.