English | Telugu
మెగాఫోన్ పట్టనున్న నటి రోహిణి
Updated : Oct 22, 2023
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అమ్మ, అత్త వంటి క్యారెక్టర్స్‌తో నటిగా ఆకట్టుకుంటోన్న సీనియర్ యాక్ట్రెస్‌ల్లో రోహిణి ఒకరు. అంతే కాదండోయ్ ఆమె మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఇవన్నీ ఒక ఎత్తైతే మరో వైపు రోహిణిలో మంచి దర్శకురాలు కూడా ఉంది. 18 ఏళ్ల ముందు అంటే 2005లో చిన్ని చిన్ని ఆశై అనే మూవీని రోహిణి డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా ఆమె తెరకెక్కించారు. తర్వాత ఎందుకనో మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. అయితే చాలా ఏళ్ల తర్వాత రోహిణి మరోసారి యాక్షన్, కట్ చెప్పటానికి రెడీ అవుతున్నారని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం.
మీడియా వర్గాల్లో వినిపిస్తోన్న వార్తలు మేరకు రోహిణి కొన్ని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. రీసెంట్ టైమ్‌లో ఇలా రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని సినిమాలను తెరకెక్కించటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. రియల్ ఇన్సిడెంట్స్‌కు కాస్త కల్పితాలను జోడించి సినిమాలను తెరకెక్కించటం మన మేకర్స్‌కు అలవాటే. జై భీమ్, శూరరై పోట్రు వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడలాగే రోహిణి సైతం నిజ ఘటనలను బేస్ చేసుకుని సినిమా చేయబోతున్నారు. రోహిణి డైరెక్షన్ చేయబోయే సినిమాకు రైటర్ ఆదవన్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. జై భీమ్ ఫేమ్ లిజో మోల్ జోస్ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
అలా మొదలైంది సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ నటిగా రోహిణి తనదైన నటనతో అలరించింది. సీనియర్ దివంగత నటుడు రఘవరన్‌ను వివాహం చేసుకున్న రోహిణి ఇప్పటికీ తన భర్తను తలుచుకుని ఆయన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంటుంది.