English | Telugu

కేసీఆర్‌ కోసం ఇల్లు తాకట్టు పెట్టిన రాకింగ్ రాకేష్!

జబర్దస్త్ కమెడియన్స్ అంత ఈమధ్య బుల్లితెరను అటు సిల్వర్ స్క్రీన్ కి ఏలేస్తున్నారంతే. ఇప్పుడు రాకింగ్ రాకేష్ "కెసిఆర్.. కేశవ చంద్ర రామావత్" అనే మూవీ తీసాడు. మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా తన సినిమా పోస్టర్‌ని రిలీజ్ చేయించాడు కూడా. అలాంటి రాకేష్ తన మూవీ జర్నీ విషయంలో ఎన్నో విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. "నా జర్నీలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా.. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అందరూ నవ్వారు. కానీ ఈరోజు మంత్రి మల్లారెడ్డితో నా మూవీ పోస్టర్ ని రిలీజ్ చేయించా..రేపు కెటిఆర్ ని కూడా కలవొచ్చేమో..ఇలా ఉంటాయి నా ఆలోచనలు. హీరోలు, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఎందుకు ఉండకూడదు. నేను కేసీఆర్‌కి పిచ్చ ఫ్యాన్‌ని అందుకే ఈ సినిమా తీశాను.

నా ఇల్లు తాకట్టు పెట్టి ఈ సినిమా తీశాను. నేను ఏ రాజకీయ నాయకుడికి తొత్తును కాదు. ఏ ఒక్కరికీ బినామీని కాదు.. నా కష్టం, ధైర్యం, ఆత్మ స్థైర్యమే నా బినామీ. ఇక ఈ సినిమా తీయడానికి తన భార్య సుజాత కూడా ఎంతో సపోర్ట్ చేసిందని.. అసలు పెళ్లే చేసుకోకూడదనుకున్న తనకి ఇంత మంచి భార్య దొరకడం అదృష్టం.. నా మూవీ కొంచెం అటు ఇటుగా ఉంది దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసరికి తన అన్న వదిన రాఘవ, పుష్ప నమ్మకంతో ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకొచ్చారని " చెప్పుకొచ్చాడు రాకేశ్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రాకేశ్ బుల్లితెరకి ఆడియన్స్‌కి పరిచయమయ్యాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ కావడంతో చాలా స్టేజ్ షోలు చేశాడు. ఇక ఇప్పుడు యాక్టర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .