English | Telugu

తన రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన ప్రగతి!

తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలకు పెట్టింది పేరైన నటి ప్రగతి. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి రెండో పెళ్ళి గురించి ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ నిర్మాతను ఆమె పెళ్లి చేసుకోబోతోందనే ఆ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై నటి ప్రగతి వీడియో ద్వారా స్పందించారు.

‘ఒక ప్రముఖ మీడియా సంస్థ నుంచి ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇది బాధ్యత రాహిత్యమే అవుతుంది. నేను ఒక నటిని కాబట్టి మీరు ఏమైనా రాయవచ్చని అనుకోవడం తప్పు. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు రాయడానికి మీకేం హక్కు ఉంది. ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు? ఇదంతా ఎవరైనా కలగన్నారా? ఎవరి కలలోకైనా ఈ వార్త వచ్చిందా? నేను దీన్ని ఖండిస్తున్నాను. ఒకరి గురించి రాసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకొని ఆధారాలు ఉంటే రాయండి. అలాంటి విషయం ఏదైనా ఉంటే నేనే చెబుతాను కదా! ఇది చాలా చీప్‌. నా ఆత్మగౌరవాన్ని ఇలా దిగజార్చడం నాకు బాధగా ఉంది. ఇక నుంచి అయినా బాధ్యతతో ఉండండి. ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌, జర్నలిజం ఎథిక్స్‌ అనేవి ఉంటాయి కదా. ఇది అన్‌ ప్రొఫెషనల్‌, అన్‌ ఎథికల్‌, వెరీ ఇర్రెస్పాన్సిబుల్‌. ఇకపై ఇలా చేయకండి..’’ అంటూ వీడియోలో పేర్కొన్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.