English | Telugu
వరుణ్, లావణ్య వెడ్డింగ్: కాక్‌టెయిల్ పార్టీలో మెగా ఫ్యామిలీ సందడి
Updated : Oct 31, 2023
మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి హడావిడిలో ఉంది. ఇటలీ చేరుకున్న రెండు కుటుంబాల వారు వేడుకకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నవంబర్ 1 మధ్యాహ్నం 2.48 గంటలకు ముహూర్తం కాగా, ముందు జరిగే వేడుకలను కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు.
ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చేరుకుంది. వీరితో పాటు అతి కొద్ది మంది మిత్రులు కూడా ఇటలీకి వెళ్లారు. కాక్ టెయిల్ పార్టీతో వివాహ వేడుక కిక్ స్టార్ట్ అయింది. ఈరోజు 11 గంటలకు హల్దీ ఫంక్షన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూల్ పార్టీ జరుగుతుంది. సాయంత్రం 5.30 గంటలకు మెహందీ వేడుక ఉంటుంది. రేపు రాత్రి 8.30 గంటలకు వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠీ కుటుంబం, స్నేహితులు కలిపి మొత్తం 120 మంది ఇటలీకి వెళ్లారు.