English | Telugu
బిగ్‌బాస్ పరమ చెత్త షో.. భానుశ్రీ షాకింగ్ కామెంట్స్!
Updated : Oct 31, 2023
చాలా కాలంగా బిగ్‌బాస్ షోకి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడిరది. దేశంలోని పలు భాషల్లో ఈ బిగ్‌బాస్ షో రన్ అవుతోంది. తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఒక హీరోయిన్ మాత్రం బిగ్‌బాస్ అనేది పరమ చెత్త షో అని కామెంట్ చేసింది.
ఇంతకీ ఎవరా హీరోయిన్ ఆమధ్య అల్లు అర్జున్‌తో ఓ సినిమాలో నటించిన భాను శ్రీ మెహ్రా ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ చిత్రంలో భానుశ్రీ హీరోయిన్‌గా నటించింది. సినిమాకి సంబంధించి ఏదో ఒక కొత్తదనం ఉండాలని భావించిన గుణశేఖర్ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది రివీల్ చెయ్యకుండా దాచాడు. ‘వరుడు’ సినిమాకి సంబంధించి జరిగిన ఒక వేడుకలో తమ సినిమాలోని హీరోయిన్ కూడా ఉందని వేదికపై ప్రకటించాడు. ఆమె ఎవరో కనిపెట్టండి అని క్లూ కూడా ఇచ్చాడు. కానీ, ఆ హీరోయిన్ ఎవరు అనేది ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత ‘వరుడు’ విడుదలై సూపర్ ఫ్లాప్ అయ్యింది. అయినా హీరోయిన్‌గా భానుశ్రీకి మంచి హైప్ వచ్చింది. కానీ, ఆ తర్వాత పెద్ద సినిమాల్లో ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. చిన్నా చితకా సినిమాలు చేసిన భానుకి బ్రేక్ రాలేదు.
అయినా పాపులారిటీ కోసం సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తూ లైమ్‌లైట్‌లో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు బిగ్‌బాస్ షో గురించి కామెంట్ చేసింది. బిగ్‌బాస్ లాంటి షోను జనం ఎలా చూస్తారో తనకు అర్థం కావడం లేదంటోంది. టీవీల్లో చాలా రకాల షోలు వస్తాయి. కానీ, అన్నింటిలో బిగ్‌బాస్ పరమ చెత్త షో, మైండ్ లెస్ షో అని ట్వీట్ చేసింది. అంతేకాదు, బిగ్‌బాస్ షోకి సంబంధించిన చెత్త అంతా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో కనిపిస్తోందని అంటోంది.