English | Telugu
నా ప్రియుడుతోనే నాపెళ్ళి.. బస్ స్టాప్ భామ వెల్లడి
Updated : Oct 31, 2023
బుల్లితెర,వెండి తెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలిచి ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న అచ్చ తెలుగు నటి శ్రీ దివ్య.లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన పర్సనల్ లైఫ్ గురించిశ్రీ దివ్య చాలా నిక్కచ్చిగా చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది.
2010 లో వచ్చిన మనసారా సినిమా తో ఎంట్రీ ఇచ్చిన శ్రీ దివ్య మారుతీ దర్శత్వంలో వచ్చిన బస్ స్టాప్ తో మంచి పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం విక్రమ్ ప్రభు హీరో గా తెరకెక్కతున్న రైడ్ లో హీరోయిన్ గా చేస్తుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక విలేకరి శ్రీ దివ్య తో మీ పెళ్లి ఎప్పుడు అని అడగ్గా శ్రీ దివ్య ఏ మాత్రం తడుముకోకుండా నేను ప్రేమించిన అబ్బాయితోనే నా పెళ్లి జరుగుతుంది. త్వరలోనే నా పెళ్లి విషయం చెప్తాను అని అనడంతో ఇప్పుడు తమిళ ,తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీ దివ్య ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా శ్రీ దివ్య పెళ్లిచేసుకోబోయేది ఎవర్ని అనే చర్చ నడుస్తుంది.
తెలుగు అమ్మాయి అయిన శ్రీ దివ్య తమిళంలో వరుతుపడతా వాలిబర్ సంఘం, కాకి సట్టై ,జీవ వెళ్ళక్కర దురై,ఈట్టి, మరుదు ,రెమో ,కాష్మోరా ఇలా సుమారు 15 చిత్రాలు చేసింది. మలయాళం లో కూడా ఒక సినిమా చేసిన శ్రీ దివ్య తన ప్రేమ పెళ్ళికి సంబంధించి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన కేరింత మూవీలో కూడా శ్రీ విద్య హీరోయిన్ గా నటించింది.