బంపరాఫర్.. ఒక టికెట్ పై ఇద్దరికి సినిమా చూసే ఛాన్స్!
రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్ గా నటించిన మూవీ "నరకాసుర". సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న విడుదలైన నరకాసుర మంచి టాక్ నే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు మూవీ టీమ్. సోమవారం నుంచి ఈ సినిమాను థియేటర్స్ లో ఒక టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.