English | Telugu
హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన ఐశ్వర్య రాయ్
Updated : Nov 1, 2023
దేవతలు పాలకడలిని చిలికినప్పుడు పుట్టిన అమృతాన్ని ఐశ్వర్య రాయ్ ఖచ్చితంగా తాగే ఉంటారు. లేకపోతే ఇన్ని సంవత్సరాల వయసులో కూడా అంత అందంగా ఉంటుందా చెప్పండి. ఈ రోజు ఐశ్వర్యారాయ్ పుట్టినరోజు. నేటితో 50 సంవత్సరాలని పూర్తిచేసుకుంటుంది. ఐశ్వర్య రాయ్ కి మా తెలుగు వన్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.
ఐశ్వర్యరాయ్ 1973 నవంబర్ 1న కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో జన్మించింది. తండ్రి ఆర్మీ అధికారి అవ్వటంతో ఐశ్వర్య ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ఐశ్వర్య విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే జరిగింది. మొదటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్న ఐశ్వర్యకి మోడలింగ్ అంటే ఇష్టం ఉండటంతో అప్పుడప్పుడు మోడలింగ్ చేస్తుండేది. అలా ఐశ్వర్య పెప్సీ కంపెనీకి సంబంధించిన యాడ్ లో అమీర్ ఖాన్, మహిమ చౌదరి లాంటి యాక్టర్స్ తో కలిసి తొలిసారి
నటించింది. ఆ తర్వాత ఎన్నో యాడ్స్ లో నటించిన ఐశ్వర్య.. మిస్ యూనివర్స్ గా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఏకంగా మిస్ వరల్డ్ గా గెలిచి భారతదేశపు జాతీయ పతాకాన్ని విశ్వవ్యాప్తం చేసింది.
సినిమాల్లో నటించాలని అందరూ ఆశపడతారు. కానీ సినిమానే ఒక నటి తన ఒడిలోకి రావాలని ఆశపడిందనే విధంగా.. ఐశ్వర్య రాయ్ సినీ ప్రస్థానం సాగిందని చెప్పవచ్చు. ఇండియన్ సినిమా గర్వించే దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం లో 1997 లో తమిళంలో వచ్చిన ఇరువర్ అనే సినిమా ద్వారా ఐశ్వర్య రాయ్ వెండి తెరకి పరిచయమైంది. ఈ సినిమానే తెలుగులో ఇద్దరుగా వచ్చింది. మొదటి సినిమాతోనే ఐశ్వర్య తన నటనతో, అందంతో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకుంది. అదే ఏడాది 'ఔర్ ప్యార్ హోగయా' అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఐశ్వర్య అందానికి నటనకి బాలీవుడ్ కూడా ఫిదా అవ్వడంతో ఆమెకి హిందీ,తమిళ చిత్రాల సినిమాల్లో వరుస పెట్టి అగ్రహీరోల సరసన సినిమాలు రావటం స్టార్ట్ చేసాయి. వాటిల్లో కొన్ని తెలుగులోకి కూడా డబ్ అయ్యి ఐశ్వర్యరాయ్ అంటే భారతీయ నటి అనే కీర్తిని తెచ్చిపెట్టాయి.
జీన్స్ , హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, చొకేర్ బాలి, రైన్ కోట్, ప్రొవోకేడ్, గుజారిష్,గురు, ధూమ్ 2 ,జోధా అక్బర్, ఎంథిరన్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి అశేష భారతీయ సినీ ప్రేక్షకులని తన నటనతో మైమరిపింప చేసింది. 2007 లో ప్రముఖ హీరో అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకొని ఐశ్వర్య రాయ్ బచ్చన్ గా మారిన ఐశ్వర్య లేటెస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన్నట్టుగా పొన్నియన్ సెల్వం మూవీ లో కూడా సూపర్ గా నటించి తన నటనలో, అందంలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తు మీరు మరిన్ని సినిమాల్లో నటించి మా అందర్నీ అలరించాలని తెలుగు వన్ తరుపున కోరుకుంటున్నాం.