English | Telugu
విమర్శలకి సమాధానం ఇచ్చిన చిరంజీవి నయా పిక్
Updated : Nov 2, 2023
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇటలీ లో వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి హడావిడి లో బిజీ గా ఉన్నారు. నిన్ననే వరుణ్,లావణ్యల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. చిరంజీవి తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్ళిలో పాల్గొంది. ఆద్యంతం ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకి సంబంధించిన పిక్ ఒక దాన్ని మెగాస్టార్ తన ఎక్స్ వేదికగా పంచుకోవడం తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే ఆ పిక్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది.
మెగా స్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వధూవరులైన వరుణ్,లావణ్య లతో కలిసి తను,పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ లు కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసారు. ఈ ఫోటో వైరల్ అవడం తో పాటు మెగా అభిమానుల్లో కూడా ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. గత కొన్ని నెలలుగా మెగా ఫ్యామిలీ లో విబేధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా స్టార్ ఈ ఒక్క ఫోటో తో అలాంటి రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టినట్టయ్యింది. అలాగే ఎవరు ఎన్ననుకున్న మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఒకటే అని కూడా చెప్పినట్టయ్యింది. అల్లు అర్జున్ కి చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య విబేధాలు ఉన్నాయని అనుకునేవాళ్ళకి కూడా మెగాస్టార్ పిక్ సమాధానం చెప్పినట్టయింది. నాగబాబు కూడా ఆ పిక్ లో ఉన్నారు
మెగా స్టార్ కి మొదటినుంచి కుడా తన కుటుంబం అంటే ఎంతో అభిమానం. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే తన ఫ్యామిలీ మొత్తం ఒక చోట ఉండాలని చిరు కోరుకుంటారు.ఇప్పుడు వరుణ్ పెళ్లితో మరో సారి మెగా స్టార్ తన కోరికని నెరవేర్చుకున్నారు. ఇంతకీ మెగా స్టార్ వరుణ్ కి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఉంటాడో అని తెలుసుకోవాలనే ఆసక్తి అటు మెగా అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో కూడా ఉంది.