English | Telugu
అగ్రిమెంట్ చూపిస్తాం.. ‘ఈగిల్’పై తప్పుడు ప్రచారం మానండి!
Updated : Nov 1, 2023
రవితేజ, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘ఈగిల్’. అనుపమ పరమేశ్వరన్, కావ్వా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అబిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో రవితేజ పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. రవితేజ కెరీర్‌లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘ఈగిల్’పైనే ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా గురించి చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సంక్రాంతికి సినిమా రిలీజ్ ఉండదని, సినిమా వాయిదా పడిరదని చెబుతున్నారని చిత్ర యూనిట్ మండి పడిరది. ‘ఈగిల్’ సినిమా సంక్రాంతికి ఉండదని ప్రచారం చేస్తున్నవారందరికీ గట్టి సమాధానం ఇచ్చింది యూనిట్. ఈ ప్రచారం చేస్తున్నవారికి, సినిమా సంక్రాంతికి లేదు అని వార్తలు రాస్తున్నవారికి కావాలంటే థియేటర్ అగ్రిమెంట్ కూడా చూపిస్తామని మేకర్స్ చెబుతున్నారు. సినిమా చాలా బాగా వస్తోందని, తప్పకుండా ‘ఈగిల్’ రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంటున్నారు. మేకర్స్ ఇచ్చిన క్లారిటీతో సినిమా రిలీజ్ లేదని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడిరది.