English | Telugu
'మార్వెల్స్' కోసం రంగంలోకి దిగిన సమంత!
Updated : Nov 3, 2023
మార్వెల్ స్టూడియోస్ యొక్క 'ది మార్వెల్స్' నవంబర్ 10న విడుదల కానుంది. ఈ సూపర్ ఫిల్మ్ కోసం స్టార్ హీరోయిన్ సమంత రంగంలోకి దిగింది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక వీడియోను విడుదల చేసి అభిమానులలో జోష్ పెంచింది. అలాగే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా రేపు(నవంబర్ 4న) అన్ని ఫార్మాట్లలో ముందస్తు బుకింగ్లు ప్రారంభమవుతాయని ప్రకటించింది.
2019 బ్లాక్ బస్టర్ హిట్ ‘కెప్టెన్ మార్వెల్’ కోసం మార్వెల్ స్టూడియోస్ తో ఆమె చిరస్మరణీయ అనుబంధం తర్వాత, ఎల్లప్పుడూ నిజమైన బ్లూ సూపర్ హీరో అభిమాని అయిన సమంత, ఇప్పుడు దిమార్వెల్స్’తో జతకట్టింది. సమంత హైదరాబాద్ లో 'ది మార్వెల్స్' కోసం ప్రత్యేక వీడియోను ఆవిష్కరించి, తన సూపర్ హీరో గురించి తన ఎక్సైట్మెంట్ ను తెలియజేసింది. అలాగే సినిమాపై తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి సినిమా పాతల్ర గెటప్స్ లో వచ్చిన ప్రత్యేక అభిమానులతో పవర్-పోజ్ ఇచ్చింది.
ది మార్వెల్స్ గురించి మరియు కెప్టెన్ మార్వెల్ పట్ల తనకున్న ప్రేమను పంచుకుంటూ సమంత, “కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో మరియు అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియాతో జతకట్టడానికి నేను థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాను. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు! మార్వెల్స్ సినిమా థియేటర్ లలో ఎపిక్ యాక్షన్-ప్యా క్డ్ ఎంటర్టైనింగ్ రైడ్ లాగా మనకు ముందుకు వస్తుంది. ఈ దీపావళికి బిగ్ స్క్రీన్ పైనే చూడటానికి నేను ఉత్సహంగా ఎదురుచూస్తున్నా ను" అని అన్నా రు.
"దిమార్వెల్స్ " ఈ దీపావళికి నవంబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో భారతీయ థియేటర్ల లోకి వస్తుంది.