English | Telugu
‘గుంటూరు కారం’ రిలీజ్ డేట్ డౌట్ అక్కర్లేదా!
Updated : Nov 3, 2023
సూపర్‌స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అయితే మహేష్ తల్లి, తండ్రి చనిపోవటం వంటి పలు కారణాలతో పాటు కథలు కొన్ని మార్పులు చేర్పులు కారణంగా సినిమా షూటింగ్ స్టార్ట్ కావటానికే సమయం పట్టింది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసి చిత్రీకరణను ప్రారంభించారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత షెడ్యూల్స్‌లో కొన్ని మార్పులు చేర్పులు జరగటంతో ‘గుంటూరు కారం’ వచ్చే సంక్రాంతి రేసులో నుంచి తప్పుకోనుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను మేకర్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు.
తాజాగా సినీ సర్కిల్స్ సమాచారం మేరకు ‘గుంటూరు కారం’ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు. అందుకు కారణం షూటింగ్ జరుగుతున్న తీరు తెన్నులే అంటున్నారు. నవంబర్ నెలాఖరు నాటికి సినిమా ఎంటైర్ టాకీ పార్ట్‌తో పాటు ఓ డ్యూయెట్, ఓ మాంటేజ్ సాంగ్‌ను పూర్తి చేస్తారట. ఇక డిసెంబర్ నెల విషయానికి వస్తే మిగిలిన రెండు పాటలు, ప్యాచ్ వర్క్‌నంతా డిసెంబర్ రెండోవారానికంతా పూర్తి చేసి ప్రమోషన్స్‌పై ఫోకస్ చేస్తారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అంటే ఆ కలెక్షన్స్ రేంజ్ మరోలా ఉంటుంది. అందుకనే ‘గుంటూరు కారం’ మేకర్స్ సంక్రాంతి రేసుకే వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటి వరకు మహేష్ మరే సినిమాలో కనిపించని విధంగా సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారు. అలాగే మాస్ రోల్‌లో మెప్పించబోతున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ఇది. ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆమె ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ కావటంతో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్సగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.