English | Telugu

మెగా సినిమాని పట్టించుకునే వారే లేరే!

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో నటించిన సినిమా. పైగా జోడిగా క్రేజీ హీరోయిన్ నటించింది. దానికి తోడు ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించింది. బడా బడా టెక్నీషియన్స్ పనిచేశారు. ఇలా ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ఓ కొత్త సినిమాపై అసలు బజ్ లేదు. దానికి ప్రధాన కారణం ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ నవంబర్ 24 ప్రేక్షకుల ముందుకు రానుంది.

అసలు ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కావాల్సి ఉండగా, నవంబర్ 10కి వాయిదా వేశారు. మళ్ళీ క్రికెట్ వరల్డ్ కప్ అంటూ నవంబర్ 10 నుంచి నవంబర్ 24కి మార్చారు. ఇలా పలుసార్లు వాయిదా కారణంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందనే అభిప్రాయముంది.

మరోవైపు 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' సినిమాలతో నిరాశ పరిచాడు. ఆ సినిమాల ఫలితం కూడా 'ఆదికేశవ'పై ప్రభావం చూపుతోంది అంటున్నారు. పైగా ప్రస్తుతం ప్రేక్షకులు విభిన్న తరహా చిత్రాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ కుర్ర హీరో పక్కా కమర్షియల్ సినిమాతో రావడం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల హవా నడుస్తోంది. అయినప్పటికీ ఆమె ఇమేజ్ కూడా సినిమాకి హైప్ తీసుకురావడంలేదు. 'ధమాకా' తరహాలో మాస్ ని ఆకట్టుకునే సాంగ్స్ లేకపోవడం కూడా మైనస్ అని చెప్పవచ్చు. మరి వీటన్నింటిని దాటుకొని విడుదల తర్వాత 'ఆదికేశవ' మూవీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

కాగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా డడ్లీ, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.