English | Telugu

మంచు విష్ణు 'కన్నప్ప' ఫస్ట్ లుక్.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు!

ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ప్రారంభమైన 'కన్పప్ప' సినిమాలో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ కన్నప్ప ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. విష్ణు బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా కన్నప్ప నుంచి తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

ప్రకృతి నడుమ భారీ శివలింగం ఆకారం ఏర్పడినట్టుగా పోస్టర్ ఎంతో క్రియేటివ్ గా ఉంది. శివలింగం నుంచి కిరణాల్లాగా బాణాలు దూసుకొస్తున్న తీరు, విల్లుని ఎక్కు పెట్టిన కన్నప్ప లుక్ ఆకట్టుకుంటున్నాయి. కన్నప్ప పాత్రకి తగ్గట్టుగా విష్ణు తన దేహాన్ని మలుచుకున్న తీరు, వస్త్రధారణ బాగున్నాయి. పోస్టర్ ని బట్టి చూస్తే.. బిగ్ స్క్రీన్ మీద ఆశించిన దానికంటే అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ 'కన్పప్ప' ఇవ్వబోతుందని అర్థమవుతోంది.

‘మహాభారత్’ను తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నారు. కన్నప్పను ఓ విజువల్ వండర్‌గా.. తెరపై ఎప్పటికీ చెరిగిపోని ఓ దృశ్యకావ్యంలా ఉండేలా నిర్మిస్తున్నామని చిత్రబృందం చెబుతోంది. హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ ఈ సినిమాకి పనిచేస్తుండటం విశేషం.

"కన్నప్ప సినిమా కోసం మా ప్రాణాన్ని పనంగా పెడుతున్నాం. మహా శివుడి ప్రియ భక్తుడైన కన్నప్పను తెరపైకి తీసుకొచ్చేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కన్నప్ప సినిమాను ఓ దృశ్యకావ్యంలా.. మునుపెన్నడూ చూడని ఓ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నాం" అని విష్ణు అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.