English | Telugu
తెల్లగానే ఉంటారు..కలిసాను కూడా అంటున్న నాగ చైతన్య
Updated : Nov 23, 2023
అక్కినేని నాగ చైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ చై బర్త్ డే సందర్భంగా నిన్న రిలీజ్ అయ్యింది. చై లుక్ ని చూసి అభిమానులు ఎంతో హుషారుతో ఉన్నారు.అలాగే దూత అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ఆ సిరీస్ కి సంబంధించి జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విలేకరి అడిగిన ప్రశ్నకు చై చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఒక విలేకరి చైతన్యతో మీరు తండేల్ చిత్రంలో బెస్తవాడిగా నటిస్తున్నారు కానీ బెస్త వాళ్ళు నల్లగా ఉంటారు మరి మీరేమో తెల్లగా ఉన్నారని అడిగాడు. దాంతో చై విలేఖరితో బెస్త వాళ్ళు నల్లగా ఉంటారని మీకు ఎవరు చెప్పారు. మా దర్శకుడు ఏ వ్యక్తిని అయితే స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడో ఆ వ్యక్తిని నేను కలిసాను అతను నాకన్నా తెల్లగా ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. దీంతో సదరు విలేకరి ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.
గత కొంత కాలంగా అక్కినేని అభిమానులు తమ హీరోల సినిమాల విషయంలో చాలా డల్ గా ఉన్నారు. నాగ్ నటించిన ఘోస్ట్ ,అఖిల్ ఏజెంట్ అలాగే చైతన్య కస్టడీ సినిమాలు పరాజయం చెందటంతో తమ హీరోలు విజయాల బాటలోకి రావాలని ప్రతి ఒక్క అక్కినేని అభిమాని కోరుకుంటున్నాడు.