English | Telugu

సెగ పుట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఫాంటసీ!

ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో? ఏది ట్రెండింగ్ కి వస్తుందో ఎవరూ ఉహించరు. అలాంటిదే ఇప్పుడు ప్రియాంక సింగ్ తన బర్త్ డే రోజున ఓ బోల్ట్ లుక్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో భాగంగానే సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ కి కూడా లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ అమ్మాయిలకు అసూయ పుట్టించేలా అందంగా రెడీ అవుతూ అచ్చమైన అమ్మాయిలనే చేసేవాడు సాయి తేజ. అలా అబ్బాయిగా ఉన్న సాయి తేజ కాస్త అమ్మాయిగా మారిపోయి ప్రియాంక సింగ్ గా కొత్త జన్మ ఎత్తింది. ప్రియాంక సింగ్ అంటే ఇప్పుడు పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ. బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తనని అభిమానులు ముద్దుగా పింకీ అని పిలుస్తారు. బిగ్ బాస్ లో తను అచ్చం తెలుగింటి ఆడపడుచులాగా ఉండేది. తన తీరు అందరికి నచ్చడంతో చాలా మంది ప్రేక్షకులు తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ నుండి వచ్చాక ప్రియాంక సింగ్ వరుస ఆఫర్స్ తో బిజీ లైఫ్ ని గడుపుతుంది. బిగ్ బాస్ తర్వాత క్రేజ్ పెరిగిందని కాబోలు ఈ అమ్మడు తన రూట్ మార్చింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తుంది.

బిగ్ బాస్ హౌస్ లో సంప్రదాయబద్ధంగా ఉన్న ప్రియాంక సింగ్.. ఇప్పుడు హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతుంది‌. తన బర్త్ డే సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ అభిమానులకి హాట్ ఫోటో షూట్ తో కన్నుల విందు చేసింది. ' ది గ్లింప్స్ ఆఫ్ ది హాటెస్ట్ ట్రాక్ ఆఫ్ ది ఇయర్' అంటూ పోస్ట్ చేసింది. ప్రతీ ఒక్కరికి తమ ఫాంటసీలు ఉంటాయి‌ కానీ మా ఫాంటసీ మీరు చూడటం కోసమే తీసాం అంటూ కొన్ని సెకండ్ల వీడియోని షేర్ చేసింది. ఇందులో బాత్ టబ్ లో నుండి పింకీ బయటకు వచ్చి వైన్ గ్లాస్ తీసుకొని తాగుతూ దర్శనమిచ్చింది. అయితే ఇది సినిమానా లేక మ్యూజిక్ ఆల్బమా లేక వీడియో సాంగా క్లారిటీ ఇవ్వలేదు పింకీ. అయితే ఈ గ్లింప్స్ చూసిన నెటిజన్లు కొంతమంది మండిపడుతూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు సూపర్, హాట్ అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. Priyanka Singh Bathtub Video

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.