English | Telugu
కళ్యాణ్ రామ్ 'డెవిల్'కి లీగల్ సమస్యలు.. విడుదల కష్టమేనా!
Updated : Nov 22, 2023
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ 'డెవిల్'. ఇందులో ఆయన బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నవంబర్ 24న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రం లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి.
'డెవిల్' మూవీని మొదట నవీన్ మేడారం దర్శకత్వంలో ప్రకటించారు. ఏం జరిగిందో ఏమో కానీ చాలా భాగం షూటింగ్ జరిగాక ప్రచార చిత్రాల్లో దర్శకుడిగా నవీన్ మేడారం పేరు మాయమై, అభిషేక్ నామా పేరు ప్రత్యక్షమైంది. నిర్మాతనే దర్శకుడిగా కూడా పేరు వేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసిన నవీన్ మేడారం.. విడుదల ముంగిట న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవీన్ పోరాటం 'డెవిల్' విడుదలపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లీగల్ సమస్యల కారణంగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా థియేట్రికల్ రైట్స్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.