English | Telugu
చిరు ఫాన్స్ లో జోష్
Updated : Nov 23, 2023
భోళాశంకర్ పరాజయంతో డీలా పడ్డ తన అభిమానులని ఆనందంలో ముంచెత్తుతు మెగాస్టార్ తన 156 వ చిత్రాన్నిచాలా అట్టహాసంగా ప్రారంభించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద మెగా ఫ్యాన్స్ లోను సినీ ప్రెక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధిచిన ఒక వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది.
మెగా 156 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజున ప్రారంభం అయ్యింది. కథకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.అలాగే మరికొన్ని రోజుల్లో సినిమాలో నటించే మిగతా నటినటుల వివరాలని కూడా ప్రకటించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఎప్పుడు పోషించని ఒక పవర్ ఫుల్ పాత్రని ఈ మూవీలో పోషించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
యువి క్రియేషన్స్ బ్యానర్ పై బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీకి చోట కె నాయుడు కెమెరా బాధ్యతలు అందిస్తున్నాడు.