English | Telugu

పాన్‌ ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్‌లో నలుగురు టాలీవుడ్‌ హీరోలు!

ప్రతి సంవత్సరం ఇండియాలోని వివిధ భాషలకు చెందిన హీరోలకు ఉన్న పాపులారిటీ, వారు చేసిన సినిమా సక్సెస్‌.. వంటి అంశాలతో ఓ సర్వే నిర్వహిస్తూ ఉంటుంది ఓ ప్రముఖ మీడియా సంస్థ. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి టాప్‌ 10 హీరోల జాబితాను విడుదల చేస్తుందా సంస్థ. ఈ సంవత్సరం మాత్రం పాన్‌ ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు టాలీవుడ్‌ హీరోలు టాప్‌ టెన్‌ లిస్ట్‌ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సంవత్సరం టాప్‌ 10లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

అక్టోబర్‌ 2023 వరకు టాప్‌ పాన్‌ ఇండియా స్టార్స్‌పై నిర్వహించిన సర్వేలో ఎవరి ఊహకూ అందని విధంగా కోలీవుడ్‌ హీరో విజయ్‌ టాప్‌ 1 ప్లేస్‌లో ఉన్నాడు. ఒక్క పాన్‌ ఇండియా హిట్‌ కూడా లేకపోయినా నెంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం విశేషమనే చెప్పాలి. ఆ తర్వాత రెండో స్థానంలో షారూక్‌ నిలిచాడు. గతంలో టాప్‌ టెన్‌లోనే షారూక్‌ లేడు. అయితే ఈ సంవత్సరం పఠాన్‌, జవాన్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌ అతని ఖాతాలో ఉండడంతో రెండో స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ఇక ప్రభాస్‌ 3వ స్థానంలో నిలిచాడు. వరసగా మూడు సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో అతనికి మూడో స్థానం దక్కింది. టైగర్‌ 3తో అలరించిన సల్మాన్‌ ఖాన్‌ 4వ స్థానంలోకి వచ్చాడు. అక్షయ్‌కుమార్‌ 5వ స్థానంలో ఉన్నాడు. మరో కోలీవుడ్‌ హీరో అజిత్‌ 6వ స్థానం సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు పాన్‌ ఇండియా హిట్‌ లేని అజిత్‌కు కూడా టాప్‌ టెన్‌లో స్థానం దక్కింది. గత సంవత్సరం టాప్‌ 5లో ఉన్న ఎన్టీఆర్‌ ఈ సంవత్సరం 7వ స్థానానికి వెళ్లాడు. ఇక అల్లు అర్జున్‌ 8వ స్థానంలో, సూర్య 9వ స్థానంలోనూ ఉండగా మహేష్‌బాబు 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.