English | Telugu

తార‌క్‌కి అప్పుడు సింగ‌ర్.. ఇప్పుడు విల‌న్?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్.. 'అర‌వింద స‌మేత' వంటి స‌క్సెస్‌ఫుల్‌ మూవీ త‌రువాత మ‌రో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని య‌న్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా కోలీవుడ్ స్టార్ శింబు న‌టించ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే గ‌నుక నిజ‌మైతే.. 'బాద్ షా' త‌రువాత తార‌క్ కాంబినేష‌న్ లో శింబు చేసే సినిమా ఇదే అవుతుంది. 'బాద్ షా'లో డైమండ్ గాళ్ పాట‌ని శింబు ఆల‌పించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. మ‌రి.. "య‌న్టీఆర్30"లో శింబు విల‌న్ గా న‌టిస్తున్నారా? లేదా? అన్న‌దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, య‌న్టీఆర్ 30కి అయిన‌ను పోయిరావ‌లె హ‌స్తిన‌కి, రాజా వ‌చ్చినాడు, చౌడ‌ప్పనాయుడు వంటి టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.