English | Telugu

`#RC15`లో ర‌ణ్ వీర్ సింగ్ విల‌నిజం?


మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `ఆచార్య‌`, `ఆర్ ఆర్ ఆర్` వంటి మ‌ల్టిస్టారర్స్ చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఐదు నెల‌ల గ్యాప్ లో థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నున్నాయి.

కాగా, ఈ సినిమాల త‌రువాత ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నారు చ‌ర‌ణ్. రామ్ చ‌ర‌ణ్ 15వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నుంది.

ఇదిలా ఉంటే.. పాన్ - ఇండియా మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ వెంచ‌ర్ లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ ని విల‌న్ గా న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ మేర‌కు ర‌ణ్ వీర్ తో సంప్ర‌దింపులు చేస్తున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి.. ఈ వార్త‌ల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ.. వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.