English | Telugu

ప్ర‌భాస్, మైత్రీ.. డైరెక్ట‌ర్ అత‌నేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ తో హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ సినిమాని నిర్మించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తార‌ని టాక్. అంతేకాదు.. ఇందులో ప్ర‌భాస్ ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని పాత్ర‌లో క‌నిపిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. ప్రభాస్ చేతిలో ప్ర‌స్తుతం `రాధేశ్యామ్`, `స‌లార్`, `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్టోరియ‌ల్ ఉండ‌గా.. సిద్ధార్థ్ ఆనంద్ ప్ర‌స్తుతం షారుఖ్ ఖాన్ తో `ప‌ఠాన్` చేస్తున్నారు. అలాగే `బ్యాంగ్ బ్యాంగ్`, `వార్` త‌రువాత త‌న ల‌క్కీ హీరో హృతిక్ రోష‌న్ కాంబినేష‌న్ లో `ఫైట‌ర్` అనే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని రూపొందించ‌బోతున్నారు సిద్ధార్థ్.

ఈ నేప‌థ్యంలో.. 2023 ఆరంభంలో ప్ర‌భాస్, సిద్ధార్థ్ ఆనంద్, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.