English | Telugu

'రుద్ర ప్ర‌తాప్'‌గా ప‌వ‌న్ - రానా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి స్టార్ రానా కాంబినేష‌న్ లో ఓ మ‌ల్టిస్టార‌ర్ మూవీ రాబోతున్న‌ సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్ సెన్సేష‌న్ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యువ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర రూపొందిస్తున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ క‌థ‌నం, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చుతున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి 'రుద్ర ప్రతాప్' అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్న‌ట్లు టాక్. ఇందులో రుద్ర‌గా ప‌వ‌న్, ప్ర‌తాప్ గా రానా క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ టైటిల్ కి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కాగా, ఈ సినిమాలో ప‌వ‌న్ కి జంట‌గా సాయిప‌ల్ల‌వి, రానాకి జోడీగా ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మ‌ల్టిస్టార‌ర్.. సెప్టెంబ‌ర్ లో రిలీజ్ కానుంద‌ని బ‌జ్.