English | Telugu

రామ్‌కి జోడీగా కృతి శెట్టి?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లింగుస్వామి కాంబినేష‌న్ లో ఓ బైలింగ్వ‌ల్ మూవీ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌నివాస‌ చిట్టూరి నిర్మించ‌నున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

కాగా, ఊర మాస్ క‌థ‌తో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామ్ కి జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర ఇద‌ని.. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో కృతి శెట్టి కూడా ఈ సినిమాకి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. త్వ‌ర‌లోనే రామ్, లింగుస్వామి చిత్రంలో కృతి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

ఇదిలా ఉంటే.. కృతి శెట్టి ప్ర‌స్తుతం రెండు తెలుగు చిత్రాల‌తో బిజీగా ఉంది. అందులో ఒక‌టి నేచురల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా రాహుల్ సంకృత్య‌న్ రూపొందిస్తున్న `శ్యామ్ సింగ రాయ్` కాగా.. మ‌రొక‌టి సుధీర్ బాబు హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం. ఈ రెండు సినిమాల్లోనూ కృతి పాత్ర‌కి ఎంతో ప్రాధాన్య‌ముంటుంద‌ని స‌మాచారం. మ‌రి.. రాబోయే చిత్రాల‌తో కృతి ఏ స్థాయిలో అల‌రిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.