English | Telugu

మెగాస్టార్‌తో శ్రుతి హాస‌న్?

మెగా కాంపౌండ్ హీరోల‌కి అచ్చొచ్చిన క‌థానాయికల్లో శ్రుతి హాస‌న్ ఒక‌రు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో 'గ‌బ్బ‌ర్ సింగ్', మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో 'ఎవ‌డు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో 'రేసు గుర్రం'.. ఇలా శ్రుతికి మెగా ఫ్యామిలీలో స‌క్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డే ఉంది. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ తో క‌ల‌సి మ‌రోసారి 'వ‌కీల్ సాబ్'లో సంద‌డి చేయ‌నున్నారు ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

ఇదిలా ఉంటే.. తాజాగా శ్రుతి హాస‌న్ కి మ‌రో మెగా కాంపౌండ్ ఆఫ‌ర్ ద‌క్కింద‌ట‌. అది కూడా.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్ లో. ఆ వివ‌రాల్లోకి వెళితే.. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో చిరుకి జోడీగా శ్రుతిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే చిరు, శ్రుతి జోడీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, ప్ర‌స్తుతం మెగాస్టార్.. 'ఆచార్య' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆపై 'లూసీఫ‌ర్', 'వేదాళ‌మ్' రీమేక్స్ చేయ‌బోతున్నారు. వాటితో పాటే బాబీ సినిమా కూడా స‌మాంత‌రంగా నిర్మాణం జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.