English | Telugu

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్?

పెళ్ళ‌యినా కాజ‌ల్ అగ‌ర్వాల్ జోష్ లో ఎలాంటి మార్పు లేదు. ఒక వైపు సినిమాలు.. మ‌రో వైపు వెబ్ సిరీస్ లు అంటూ.. ముందుకు సాగుతోందీ పంచ‌దార బొమ్మ‌. రీసెంట్ గా 'లైవ్ టెలీకాస్ట్' అనే వెబ్ సిరీస్ తో ప‌ల‌క‌రించిన కాజ‌ల్.. వ‌చ్చే నెల‌లో మంచు విష్ణుతో క‌ల‌సి 'మోస‌గాళ్ళు'లో సంద‌డి చేయ‌నుంది. అలాగే.. 'ఖైదీ నంబ‌ర్ 150' త‌రువాత మెగాస్టార్ చిరంజీవితో కాజ‌ల్ జోడీ క‌ట్టిన 'ఆచార్య' వేస‌విలో వినోదాలు పంచ‌నుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కాజ‌ల్ మ‌రో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యాక్ష‌న్ హీరో గోపీచంద్ తో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే సినిమా చేయ‌బోతున్న ద‌ర్శ‌కుడు మారుతి.. మ‌రోవైపు ఆహా కోసం ఓ సిరీస్ ప్లాన్ చేశారు. 'త్రీ రోజెస్' పేరుతో రూపొంద‌నున్న ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ట‌. ఇందులోనే కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే కాజ‌ల్, మారుతి కాంబినేష‌న్ పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.