English | Telugu

`ఆదిపురుష్`లో కీర్తి సురేష్?

`మ‌హాన‌టి`తో ఉత్త‌మ న‌టిగా జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్నారు కీర్తి సురేశ్. ఆ బ‌యోపిక్ తీసుకువ‌చ్చిన గుర్తింపుతో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ బ‌యోగ్రాఫిక‌ల్ స్పోర్ట్స్ డ్రామా `మైదాన్`లో నాయిక‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కినా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశారు కీర్తి. అలా.. కీర్తి బాలీవుడ్ డెబ్యూ కార్య‌రూపం దాల్చ‌లేక‌పోయింది.

క‌ట్ చేస్తే.. ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఓ క్రేజీ బాలీవుడ్ వెంచ‌ర్ లో నాయిక‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ టైటిల్ రోల్ లో `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ `ఆదిపురుష్` పేరుతో ఓ మైథ‌లాజిక‌ల్ ట‌చ్ ఉన్న మూవీని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సీత పాత్ర కోసం ప‌లువురు బాలీవుడ్ భామ‌ల పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా.. `1 నేనొక్క‌డినే` ఫేమ్ కృతి స‌న‌న్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. హిందీ బాబుల తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. ఆ పాత్ర `మ‌హాన‌టి` కీర్తి సురేశ్ కి ద‌క్కింద‌ని టాక్. మ‌రి.. ఈ వార్త‌ల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న `ఆదిపురుష్` 2022 ఆగ‌స్టు 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.