English | Telugu
రాజుల నాటి ఆతిథ్యం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యం అంటున్నారు!
Updated : Feb 16, 2023
ప్రభాస్ తనతో పని చేసిన నటీనటులను బాగా గౌరవిస్తారు. వారిని గుర్తుంచుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. తనతో సుదీర్ఘకాలం సాన్నిహిత్యం ఉన్న సన్నిహితులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇటీవల మిల్కీ బ్యూటీ ఒక తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ఆతిథ్యం గురించి పొగడ్తల వర్షం కురిపించింది. ప్రభాస్ తో వర్క్ చేసిన చాలామంది ఆయన షూటింగ్ సందర్భంగా వ్యవహరించే తీరు ఇంటి నుంచి వచ్చే లంచ్ , డిన్నర్ బాక్సుల గురించి మాట్లాడటం జరిగింది.
తమన్న కూడా అదే తరహాలో మాట్లాడి ఆ జాబితాలో చేరింది తమన్నా మాట్లాడుతూ ప్రభాస్ తన ఇంటికి వచ్చిన అతిధులను ఎలా చూసుకుంటాడో దేశం మొత్తానికి తెలుసు. ఆయన భోజనంకు ఆహ్వానిస్తే 30 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తాడు. డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. రాజు అనే వాడు ఇలాగే ఉంటాడేమో అనిపించే విధంగా ఆయన ఇచ్చే ఆతిధ్యం ఉంటుంది. మంచితనంతో అతిధి మర్యాదలతో బాబోయ్ అనిపిస్తాడు. తనకు అంతగా అంతటి స్టార్డం ఉన్న, అభిమానులు ఉన్నా కూడా సింపుల్గా అందరితో కలిసి పోతూ ఉంటాడు.
చాలా తక్కువ మంది ఇలా ఉంటారు. ఇది ప్రభాస్‌కు మాత్రమే సాధ్యం. ఆయన యొక్క సింప్లిసిటీ అందరికీ నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇలా మాట్లాడిన వాటిలో అమితాబచ్చన్ మొదలుకొని దీపికా పడుకొనే ,శృతిహాసన్, శ్రద్ధ కపూర్, కుర్తి సనన్ ఇంకా ఎంతో మందిస్టార్స్ ఉన్నారు. ఆయన ఆతిథ్యం పొందాలని కూడా చాలామంది ప్రభాస్ తో వర్క్ చేయాలని కోరుకుంటూ ఉంటారట. ప్రస్తుతం ఆయన అరడజనుకు పైగా చిత్రాలలో బిజీగా ఉన్నారు. రాబోయే రెండేళ్లలో ఆయన నుంచి ఐదారు సినిమాల వరకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవ్వన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. అన్ని చిత్రాలు వందల కోట్లతో రూపొందుతున్నాయి. కేవలం మారుతితో చేస్తోన్న చిత్రం మాత్రమే తక్కువ బడ్జెట్ తో రూపొందుతోంది.