English | Telugu
‘సలార్‘ పార్ట్ 2 ... ఎవరి భయం వారిది!
Updated : Feb 15, 2023
ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ వన్, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆ రెండు చిత్రాలను తెరకెక్కించిన ఓం భలే ఫిల్మ్స్ సంస్థ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను ఇమేజ్ ను తెచ్చుకున్నాయి. ప్రశాంత్ నీల్కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. ఇక కే జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2లతో పాటు కాంతారా చిత్రంతో హోం బలే ప్రొడక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ హోం భలే ప్రొడక్షన్స్ కాంబినేషన్లో ప్రభాస్ హీరోగా సలార్ చిత్రం రూపొందుతోంది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
సలార్ 1, సలార్ 2గా ఈ చిత్రం రానుందని అంటున్నారు. అయితే ఎవరైనా సెకండ్ పార్ట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే మొదటి పార్ట్ విడుదల అయ్యేంతవరకు వేచి చూడడం ఉత్తమం. ఫస్ట్ పార్ట్ కు వచ్చే టాక్, గుర్తింపు, కలెక్షన్లు వంటి వాటిని బట్టి సీక్వెల్న ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మొదటి పార్ట్ ఫలితంతో సంబంధం లేకుండా రెండో పార్ట్ ను ప్రారంభించాలని సలార్ నిర్మాతలు భావిస్తున్నారట. హోంబలే నిర్మాతలు మాత్రమే సలార్ కి సీక్వెల్ తీయాలని భావిస్తున్నారు. దర్శకుని నిర్ణయం మాత్రం ఇంకా తెలియలేదు. ఈ విషయమై ఓం భలే ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాతలు దర్శకుడు ప్రశాంతి నీల్ కు ప్రత్యేక మీటింగ్ జరుగుతుందట.
ఈ మీటింగ్ లో సలార్ సీక్వెల్ ఉండాలా లేదా అనే విషయంలో ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. దర్శకుడి నిర్ణయం పైనే సలార్ 2 నిర్ణయం ఉంటుందని సమాచారం. అయితే ఈ మీటింగ్ వెనుక హోం భలే ప్రొడక్షన్స్ ముందు జాగ్రత్త కూడా ఉందని అంటున్నారు. కే జి ఎఫ్ ఫ్రాంచైజీ తో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి నీల్ తో సినిమా చేయడానికి ప్రస్తుతం దేశంలోని స్టార్ హీరోలు అందరూ క్యూ కడుతున్నారు.
సలార్ ఫలితంతో సంబంధం లేకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, యష్ వంటి స్టార్ హీరోలు ప్రశాంత్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వాళ్లతో ప్రశాంత్ నీల్ కు కమిట్మెంట్స్ ఉన్నాయి. వాళ్లతో సినిమాలు పూర్తి చేసే వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇదే విషయమై దర్శక నిర్మాతల మధ్య ఈ ప్రత్యేక మీటింగ్ ఉండనుందని సమాచారం. సదరు హోంబలే సంస్థ ఇప్పటికే ప్రశాంత్ నీల్ కు భారీగా అడ్వాన్సులు చెల్లించింది. వరుసగా రెండు మూడు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ ప్రశాంత్ నీల్ మాత్రం పాన్ ఇండియా క్రేజ్ నడుమ తమ సంస్థ చేతుల్లోంచి జారిపోతున్నాడని దాంతోనే హుటాహుటిన ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని ఇన్సైడ్ టాక్. మొత్తానికి ఎవరి భయం వారిది అన్నట్టుగా పరిస్థితి ఉంది. సలార్ సీక్వెలు తో ప్రశాంత్ నీల్ ను తమ సంస్థ నుంచి జారిపోకుండా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఇతర పాన్ ఇండియా స్టార్లతో ఇతర నిర్మాణ సంస్థలతో, హోంబలేతో పాటు తనకు మరింత ఎక్కువ పారితోషికం ఇచ్చే వారితో కలిసి పని చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఆ సంస్థ నుంచి దాటి పాన్ ఇండియా లెవెల్ లో ఇంకా తన సత్తా చాటాలని ప్రశాంత నీల్ భావిస్తున్నారు. దాంతో వీరిద్దరి మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. దాంతో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు.