English | Telugu
ధైర్యంగా ఫ్లాఫ్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్న చిరు!
Updated : Feb 16, 2023
150 చిత్రాల వరకు ఆచితూచి అడుగులు వేస్తూ కేవలం భారీ దర్శకులు విజయాలను అందుకున్న దర్శకుల వైపు చూస్తూ వారికే అవకాశం ఇస్తూ వచ్చిన చిరంజీవి రీ ఎంట్రీ లో మాత్రం భిన్నంగా సాగుతున్నారు. పిలిచి మరి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు విజయం అనేది ఎరుగని మెహర్ రమేష్ కు పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వడం అంటే ఒక్కసారిగా ఎవరైనా స్టన్ అయిపోతారు. మెహర్ రమేష్ సంగతి అందరికీ తెలిసిందే. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి చిత్రాలతో ఈయన జనాలను పిచ్చెక్కించారు.
ఆయనకు పిలిచి మరి వేదాలం రీమేక్నో బోళా శంకర్ గా చేసే అవకాశం అందించారు. కేవలం మెహర్ రమేష్ చిరుకి బంధువు కావడం వల్లే అలా చేశాడా లేక నిజంగా దర్శకునిగా మెహర్ రమేష్ పై నమ్మకం ఉండి ఆ చిత్రం ఇచ్చాడా అనేది అర్థం కావడం లేదు. తాజాగా చిరు పూరి జగన్నాథ్‌కు, మారుతికి సైతం అవకాశాలు. సురేందర్ రెడ్డి, కొరటాల శివ, బాబి వంటి దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. తాజాగా మరోదర్శకుడు లైన్ లోకి వచ్చాడు. అతను ఎవరో కాదు కళ్యాణ కృష్ణ. సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం వంటి రెండు చిత్రాలతో మంచి హిట్స్‌ను కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఆ తర్వాత నేల టికెట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. కానీ బంగార్రాజుతో పర్వాలేదనిపించారు. ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరుని కలిసి హిట్లర్ వంటి ఓ ఫ్యామిలీ స్టోరీని విడిపించాడట.
ఓ రియల్ ఫ్యామిలీ స్టోరీ ఆధారంగా ఈ కథను తయారు చేశాడని ఓ కు గ్రామంలో ఓ పెద్దింటి కుటుంబంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథ రూపొందిందని సమాచారం. చిరు ఓకే చెప్పాడని అయితే కొన్ని డెవలప్మెంట్స్ సూచించారని సమాచారం. అలాగే స్టొరీకి సంబంధించిన కొన్ని వివరాలు కూడా లీక్ అవుతున్నాయి. ఈ సినిమాను కమర్షియల్ గా మార్చడానికి ఈ కథలో కొన్ని ఇంప్రూవ్ మోంట్స్ ని సైతం చిరు స్వయంగా ఇచ్చారట. ఆ రకంగా కథలో కొన్ని అంశాలు జొప్పించి మరోసారి పిలిచినట్టు సమాచారం. మొత్తానికి కళ్యాణ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.