English | Telugu
నాగార్జున హ్యాండిచ్చాడా?
Updated : Feb 15, 2023
అభిరుచి ఉన్న నిర్మాతల్లో ఎడిటర్ మోహన్ ఒకరు. ఆయన కుమారుడిగా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన వ్యక్తి మోహన్ రాజా. సరిగ్గా 22 నెల క్రితం జగపతిబాబు, అర్జున్, వేణులతో హనుమాన్ జంక్షన్ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అయినా తెలుగులో అవకాశాలు రాలేదు. తమిళ్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ తెలుగు చిత్రాలును వరుసగా రీమేక్ చేస్తూ విజయాలు అందుకున్నారు. జయం చిత్రంతో తన సోదరుడిని జయం రవిగా పరిచయం చేశారు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కిక్, ఆజాద్ వంటి సినిమాలను రీమేక్ చేసి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఒరిజినల్ స్టోరీ తని వరువన్ తో సంచలనం సృష్టించారు. ఆ చిత్రం తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకుడిగా రామ్ చరణ్ హీరోగా ధ్రువగా రీమేక్ అయింది. మరలా తెలుగులో చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ సినిమాని చేశాడు. మలయాళ లూసీఫర్ రీమేక్ కోసం చిరు వినాయక్ నుంచి సుజిత్ వరకు ఎన్నో దర్శకులను పరిశీలించిన చివరికి చిరంజీవి ఫైనల్ గా లూసిఫర్ రీమేక్ బాధ్యతలను మోహన్ రాజాకు అప్పగించారు. కానీ ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది కానీ భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఆయన పరిస్థితి మరలా ఇబ్బందికరంగా మారింది.
గాడ్ ఫాదర్ కి ముందు మోహన్ రాజా స్టోరీకి కింగ్ నాగార్జున ఓకే చెప్పడం జరిగింది. అది నాగార్జున వందో చిత్రంగా చేస్తున్నామని గాడ్ ఫాదర్ ప్రమోషన్స్‌లో మోహన్ రాజా వెల్లడించారు. ఆ మూవీలో అఖిల్ కీలకపాత్రలో నటిస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ గాడ్ ఫాదర్ రిజల్ట్ తర్వాత అంతా సీన్ మారిపోయింది. నాగార్జున ఈ ప్రాజెక్టు విషయాన్నీ ఎక్కడా ప్రస్తావించడం లేదు. కేవలం రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ సినిమాని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. దాంతో నాగ్ నుంచి స్పందన లేకపోవడంతో తని వరువన్ సీక్వెల్ పనుల్లో మోహన్ రాజా బిజీ అయిపోయారు. అంటే ఆయన మరలా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయాడని సమాచారం.