English | Telugu
సూపర్‌స్టార్ రెమ్యునరేషన్ పవన్‌కల్యాణ్ కన్నా ఎక్కువే!
Updated : Feb 15, 2023
సూపర్‌స్టార్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టి చర్చ జరుగుతోంది. రోజుకు నాలుగు కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్.అన్నాత్తే సినిమా తర్వాత రజనీ యాక్టింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారని అనుకున్నారు. అయితే ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ చెప్పిన జైలర్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జైసల్మేర్‌లో జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత జై భీమ్ డైరక్టర్ జ్ఞానవేల్‌తో పనిచేస్తారనే టాక్ ఉంది.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ అనే సినిమా అంగీకరించారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏడు రోజుల్ని కేటాయించారట. దాదాపు పాతిక కోట్లను రెమ్యునరేషన్‌గా ఇవ్వడానికి అంగీకరించారట మేకర్స్. అంటే రోజుకు దగ్గర దగ్గర నాలుగు కోట్ల రూపాయలన్నమాట. ఈ సినిమాను క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తోంది.
రజనీకాంత్ ఈ సినిమాలో ముస్లింగా కనిపిస్తారట. బాషా సినిమాలో తన ఫ్రెండ్ కోసం ముస్లింగా పేరు మార్చుకుంటారు రజనీకాంత్... గుర్తుందా? మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన ముస్లింగా తెరపై కనిపించనున్నారు.లాల్ సలామ్‌లో రజనీకాంత్ చేస్తున్న పాత్ర కన్నా, ఆయనకు అంత పారితోషికం ఇస్తున్నారా? అనే విషయం మీదే చర్చ ఎక్కువగా జరుగుతోంది. టాలీవుడ్‌లో రీసెంట్ టైమ్స్ లో పవన్ కల్యాణ్ రోజుకు రెండున్నర కోట్లు తీసుకుంటున్నారనే విషయం మీద కూడా గట్టిగా చర్చ జరిగింది. ఈ లెక్కన పవన్ కన్నా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారన్నమాట.కూతురు కోసం రజనీకాంత్ ఫ్రీగా నటిస్తారన్న మాటలకు ఇప్పుడు చెక్ పడింది.ఐశ్వర్య ఇంతకు ముందు త్రీ, వెయ్ రాజా వెయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.