English | Telugu
‘పుష్ప 2’... ఏప్రిల్ 8 వరకు లేనట్టే!
Updated : Feb 22, 2023
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 దిరూల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్ పుష్పాది రైజ్ చిత్రంతో తన సత్తా చాటిన ఐకాన్ సార్ పుష్ప 2 ది రూల్ సినిమాతో మరో పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్లు ఈ చిత్రాన్ని మొదటి భాగంతో పోల్చితే రెండో భాగాన్ని గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. విశాఖపట్నంలో హీరో పరిచయ గీతాన్ని చిత్రీకరించారు. అభిమానులు ఆ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. టీజర్ ఎప్పుడు అని ఆరా తీస్తున్నారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8 వరకు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాదని టాక్ వినిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు నాడే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నారట. అప్పటివరకు ఫ్యాన్స్ ఓపిక పట్టాలి. పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఆయనతో పాటు మంగళం శ్రీను గా సునీల్, ద్రాక్షాయణి పాత్రధారి అనసూయ భరద్వాజ్ లతో పాటు జగపతిబాబు కూడా ఓ విలన్ గా నటించనున్నాడని సమాచారం. విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ కూడా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 250 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళం, హిందీల తో కలిపి మొత్తం పది భాషల్లో విడుదల చేయనున్నారు. ఇకపోతే రీసెంట్‌గా అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం... అదే పులి నాలుగు అడుగుల వెనక్కి వేసింది అంటే పుష్పరాజు వచ్చాడని అర్థం అనే డైలాగ్ సోషల్ మీడియాలో లీకై సినీ ప్రియుల చేత ఈలలు వేయించింది. మొత్తంగా 1000కోట్ల టార్గెట్‌లో ఈ పుష్ప 2 ది రూల్ చిత్రం రూపొందుతోంది.